BAN Vs ZIM: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే.. 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం | BAN Vs ZIM 5th T20I: Zimbabwe Beat Bangladesh By 8 Wickets To Avoid Series Clean Sweep, Score Details Inside | Sakshi
Sakshi News home page

BAN Vs ZIM 5th T20I: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే.. 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం

May 12 2024 2:37 PM | Updated on May 12 2024 5:29 PM

Zimbabwe beat Bangladesh by 8 wickets

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ప‌సికూన జింబాబ్వే ఊహించ‌ని షాకిచ్చింది. ఢాకా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో క్లీన్‌స్వీప్‌ నుంచి జింబాబ్వే త‌ప్పించుకుంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6  వికెట్ల న‌ష్టానికి 157 ప‌రుగులు చేసింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో మ‌హ్మ‌దుల్లా(54) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. కెప్టెన్ న‌జ్ముల్ హోస్సేన్ షాంటో(36) ప‌రుగుల‌తో రాణించాడు.

జింబాబ్వే బౌల‌ర్ల‌లో ముజాబ్‌రానీ, బెన్నెట్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జాంగ్వే, మ‌స‌క‌జ్డా చెరో వికెట్ సాధించారు. అనంత‌రం 158 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జింబాబ్వే.. కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.3 ఓవర్ల‌లో చేధించింది. జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ బెన్నెట్‌(70 ), సికింద‌ర్ ర‌జా(72 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. 

బంగ్లా బౌల‌ర్ల‌లో ష‌కీబ్ ఆల్‌హ‌స‌న్‌, సైఫుద్దీన్ త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు. ఇక తొలి నాలుగు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్‌ను 4-1 తేడాతో కైవ‌సం చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement