దక్షిణాఫ్రికా తొలి టెస్టు.. తీవ్రంగా శ్రమిస్తున్న కోహ్లి! వీడియో వైరల్‌ | Virat Kohli Sweats It Out In Nets Ahead Of IND Vs SA 1st Test, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

IND vs SA: దక్షిణాఫ్రికా తొలి టెస్టు.. తీవ్రంగా శ్రమిస్తున్న కోహ్లి! వీడియో వైరల్‌

Published Sun, Dec 24 2023 5:04 PM

Virat Kohli sweat it out in nets ahead of IND vs SA 1st Test - Sakshi

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌. వ్యక్తిగత కారణాల దృష్ట్యా దక్షిణాఫ్రికా నుంచి లండన్‌కు వెళ్లిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి.. తిరిగి మళ్లీ ప్రోటీస్‌ గడ్డపై అడుగుపెట్టాడు. విరాట్‌ ప్రస్తుతం భారత జట్టుతో ఉన్నాడు. ఈ క్రమంలో తొలి టెస్టు కోసం నెట్స్‌లో విరాట్‌ కోహ్లి తీవ్రంగా శ్రమిస్తున్నాడు.  ఆదివారం జోహన్నెస్‌బర్గ్‌లోని సూపర్‌ స్పోర్ట్స్‌ పార్క్‌లో విరాట్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు.

దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు నెట్స్‌లోనే కోహ్లి ఉన్నట్లు తెలుస్తోంది. అతడి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇక ఇది ఇలా ఉండగా.. ఇప్పటివరకు సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ను ఒక్కసారి గెలవలేకపోయినా భారత్‌.. ఈసారి  చరిత్ర స‌ృష్టించాలని పట్టుదలతో ఉంది. అందుకోసం అన్ని విధాల టీమిండియా సన్నద్దమవుతోంది. రోహిత్‌ శర్మ సారథ్యంలో పూర్తి స్ధాయి జట్టు సఫారీలతో తలపడనుంది.  

కాగా డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అదే విధంగా మహ్మద్‌ షమీ కూడా ఈ సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు.
చదవండి: IPL 2024: లక్నో సూపర్‌ జెయింట్స్‌ కీలక నిర్ణయం..!? సురేష్‌ రైనాకు..

Advertisement
Advertisement