IPL 2023: Virat Kohli Become-1st Batter Complete 7000 Runs In IPL History - Sakshi
Sakshi News home page

#ViratKohli: 'కింగ్‌' కోహ్లి చరిత్ర.. ఐపీఎల్‌లో తొలి బ్యాటర్‌గా

May 6 2023 8:09 PM | Updated on May 6 2023 8:14 PM

Virat Kohli Become-1st Batter Complete 7000 Runs In IPL History - Sakshi

Photo: IPL Twitter

ఆర్‌సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి ఏడువేల పరుగులు మార్క్‌ను చేరుకున్నాడు. ఐపీఎల్‌లో 7వేల రన్స్‌ సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు.

కోహ్లి  233 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఇక కింగ్‌ కోహ్లి ఖాతాలో ఐదు సెంచరీలు, 49 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కోహ్లి తర్వాతి స్థానంలో శిఖర్‌ ధవన్‌ (6536), డేవిడ్‌ వార్నర్‌ (6189), రోహిత్‌ శర్మ (6063) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement