క్వార్టర్‌ ఫైనల్లో సహజ | Sahaja in the quarter final | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో సహజ

Jul 20 2024 2:44 AM | Updated on Jul 20 2024 2:44 AM

Sahaja in the quarter final

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య డబ్ల్యూ75 టోర్నీ లో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి సింగిల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. అమెరికాలో శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 318వ ర్యాంకర్‌ సహజ 6–3, 7–6 (7/5)తో ప్రపంచ 177వ ర్యాంకర్, రెండో సీడ్‌ ఎలిజబెత్‌ మాండ్లిక్‌ (అమెరికా)పై గెలిచింది. డబుల్స్‌లో సహజ (భారత్‌)–హిరోకో కువాటా (జపాన్‌) జోడీ సెమీఫైనల్లోకి చేరింది. 

Advertisement
 
Advertisement
Advertisement