Rohit Sharma Wife Ritika Funny Comments On His New Look Goes Viral - Sakshi
Sakshi News home page

Rohit Sharma New Look: భార్య రితికా ఫన్నీ కామెంట్

Jan 12 2022 9:47 PM | Updated on Jan 13 2022 11:00 AM

Rohit Sharma Wife Ritika Posts Hilarious Comment After Team India Skipper Unveils New Look - Sakshi

ముంబై: గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా పరిమిత ఓవర్ల సారధి రోహిత్‌ శర్మ.. ప్రస్తుతం దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బరువు తగ్గడంతో పాటు న్యూ లుక్‌తో అదరగొట్టాడు. గత కొంత కాలంగా జాతీయ క్రికెట్ అకాడమీ రిహాబిటేషన్‌లో గడుపుతున్న రోహిత్‌.. బాగా సన్నబడిపోయి, క్లీన్‌ షేవ్‌తో కనిపించాడు. న్యూ లుక్‌కు సంబంధించిన ఫోటోను అతనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.


ఇందులో అతను దేనివైపో తీక్షణంగా చూస్తున్నట్టు  ఫోజ్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. రోహిత్‌ లుక్‌పై అభిమానులు, టీమిండియా క్రికెటర్లతో పాటు అతని భార్య రితికా సజ్దే కూడా స్పందించింది. క్లీన్ షేవ్‌తో రోహిత్‌ యంగ్‌గా మారిపోయాడని అభిమానులు, సహచర​ క్రికెటర్లు అంటుండగా.. భార్య రితికా మాత్రం ఫన్నీ కామెంట్‌ చేసింది. "వై సో బ్రూడీ(అసంతృప్తితో ఆలోచించడం)" అంటూ రాసుకొచ్చింది. రోహిత్‌ న్యూ లుక్‌పై రితిక చేసిన కామెంట్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. 

చదవండి: Gambhir On KL Rahul: వికెట్ కీపర్ ఎప్పటికీ ఓపెనింగ్ బ్యాటర్ కాలేడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement