కొద్దిలో తప్పించుకున్నాడు.. లేదంటే మొహం పచ్చడయ్యేది | Rishabh Pant Almost Hits Dinesh Karthik Try To Stop Ball Hitting Stumps | Sakshi
Sakshi News home page

IPL 2021: కొద్దిలో తప్పించుకున్నాడు.. లేదంటే మొహం పచ్చడయ్యేది

Sep 28 2021 6:38 PM | Updated on Sep 28 2021 8:19 PM

Rishabh Pant Almost Hits Dinesh Karthik Try To Stop Ball Hitting Stumps - Sakshi

Courtesy: IPL Twitter

Rishabh Pant Almost Hits Dinesh Karthik.. ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ దినేశ్‌ కార్తిక్‌ను కొట్టినంత పని చేశాడు. అయితే ఇది కావాలని చేశాడనుకుంటే పొరపాటే అవుతుంది. బంతి వికెట్ల మీద పడితే ఔటవుతానేమోనని భయపడిన పంత్‌ కాపాడుకునేందుకు బ్యాట్‌తో హిట్‌ చేశాడు. అయితే స్టంప్‌ అవుట్‌ చేసే అవకాశం ఉండడంతో కార్తిక్‌ వికెట్ల పక్కనే నిల్చున్నాడు. పంత్‌ వెనక్కి తిరిగి బ్యాట్‌తో కొట్టబోతుంటే కార్తిక్‌ హెల్మెట్‌కు బలంగా తగిలింది. దీంతో కార్తిక్‌ వికెట్లను తన్నుకుంటూ కిందపడిపోయాడు. ఆ తర్వాత కార్తిక్‌ను పైకి లేపిన పంత్‌ తన చర్యకు క్షమాపణలు చెప్పుకున్నాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో మాత్రం నవ్వులు పూయిస్తుంది. వరుణ్‌ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది.  

చదవండి: IPL 2021: డెబ్యూ మ్యాచ్‌లోనే గొడవ.. మోర్గాన్‌ మద్దతు


Courtesy: IPL Twitter

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓ‍వర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌, రిషబ్‌ పంత్‌ చెరో 39 పరుగులు చేయగా.. శిఖర్‌ ధావన్‌ 24 పరుగులు చేశాడు. కేకేఆర్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, సునీల్‌ నరైన్‌ తలా రెండు వికెట్లు తీశారు. ఇక కేకేఆర్‌ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.

చదవండి: Rohit Sharma: అరే.. "రోహిత్‌ శర్మ" పాకిస్తాన్‌లో ఉన్నాడేంటి?

Advertisement
 
Advertisement
Advertisement