Ranbir Kapoor Reportedly Finalised To Play Sourav Ganguly Biopic Says Reports - Sakshi
Sakshi News home page

Sourav Ganguly Biopic: త్వరలో పట్టాలెక్కనున్న సౌరవ్‌ గంగూలీ బయోపిక్‌.. హీరో అతనే..!

Feb 22 2023 6:54 PM | Updated on Feb 22 2023 7:11 PM

Ranbir Kapoor Roped In To Play Sourav Ganguly In Biopic Says Reports - Sakshi

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్‌ సౌరవ్ గంగూలీ బయోపిక్‌ అతి త్వరలో పట్టాలెక్కేందుకు రెడీ ఉం‍దని తెలుస్తోంది. ఈ బయోపిక్‌లో దాదా పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌, చాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ నటించడం దాదాపుగా ఖరారైందని సమాచారం. ఈ విషయాన్ని గంగూలీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి రివీల్‌ చేశాడని క్రికెట్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

గతంలోనూ చాలా సందర్భాల్లో ఈ ప్రచారం జరిగినప్పటికీ.. గంగూలీ, రణ్‌బీర్‌లకు సంబంధించిన వారెవ్వరూ నోరు మెదపలేదు. తాజాగా గంగూలీకి అతి దగ్గరగా ఉండే ఓ వ్యక్తి ఈ విషయాన్ని ధృవీకరిం‍చాడు. దాదా బయోపిక్‌కు సంబంధించి గతంలో ఇరు వర్గాలు చాలాసార్లు సిట్టింగ్‌ చేసినప్పటికీ.. రణ్‌బీర్‌ డేట్స్‌ కుదరక ఎలాంటి ఒప్పందం జరగలేదని, ప్రస్తుతం రణ్‌బీర్‌ డేట్స్‌ కుదరడంతో డీల్‌ ఓకే అయ్యిందని, గంగూలీ గురించి లోతైన సమాచారం తెలుసుకునేందుకు మరో ముఖ్యమైన వ్యక్తితో (దర్శకుడు) కలిసి రణ్‌బీర్‌ త్వరలోనే కోల్‌కతాకు వెళ్లనున్నాడని సదరు వ్యక్తి మీడియాకు ఉప్పందించాడు.

అయితే దర్శకుడు ఎవరనే విషయాన్ని వెల్లడించేందుకు ఆ వ్యక్తి నిరాకరించినట్లు తెలుస్తోంది. కోల్‌కతా పర్యటనలో రణ్‌బీర్‌.. ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానాన్ని, క్యాబ్‌ అఫీస్‌ను అలాగే గంగూలీ ఇంటిని సందర్శించనున్నట్లు సమాచారం. కాగా, దాదా ప్రస్తుతం క్రికెట్‌కు సంబంధించి ఏ అధికారిక పదవిలో లేకపోగా.. రణ్‌బీర్‌ మాత్రం 'తూ ఝూటీ మై మక్కర్‌' అనే చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు.  తన బయోపిక్‌లో నటించేందుకు హృతిక్‌ రోషన్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రాలను గంగూలీ గతంలో సంప్రదించినట్లు టాక్‌ నడిచిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement