రసవత్తరంగా సాగిన లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ | Legends League Cricket 2024: Manipal Tigers Beat Toyam Hyderabad In Super Over, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

LLC 2024: రసవత్తరంగా సాగిన లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌

Oct 4 2024 7:22 AM | Updated on Oct 4 2024 9:50 AM

LLC 2024: Manipal Tigers Beat Toyam Hyderabad In Super Over

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌-2024లో భాగంగా మణిపాల్‌ టైగర్స్‌, తోయమ్‌ హైదరాబాద్‌ మధ్య నిన్న (అక్టోబర్‌ 3) జరిగిన మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌ 'టై'గా (‌ఇరు జట్ల స్కోర్లు సమం) ముగియడంతో సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో తోయమ్‌ హైదరాబాద్‌పై మణిపాల్‌ టైగర్స్‌ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టైగర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తిసార పెరీరా మెరుపు ఇన్నింగ్స్‌ (27 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి టైగర్స్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఏంజెలో పెరీరా (18), పియెనార్‌ (11) రెండంకెల స్కోర్లు చేశారు. 

వీరి మినహా టైగర్స్‌ ఇన్నింగ్స్‌ కనీసం చెప్పుకోదగ్గ స్కోర్లు కూడా లేవు. తోయమ్‌ హైదరాబాద్‌ బౌలర్లలో గురుకీరత్‌ సింగ్‌, బిపుల్‌ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. ఉడాన, నువాన్‌ ప్రదీప్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన తోయమ్‌ హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి టైగర్స్‌ చేసినన్ని పరుగులే (144) చేసింది. దీంతో మ్యాచ్‌ టైగా ముగిసి సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. తోయమ్‌ హైదరాబాద్‌ను గెలిపించేందుకు స్టువర్ట్‌ బిన్నీ (20 నాటౌట్‌), గురుకీరత్‌ సింగ్‌ మాన్‌ (37 నాటౌట్‌), షాన్‌ మార్ష్‌ (38) విఫలయత్నం చేశారు.

సూపర్‌ ఓవర్‌ సాగిందిలా..
సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన తోయమ్‌ హైదరాబాద్‌ వికెట్‌ నష్టానికి నాలుగు పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఐదు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మణిపాల్‌ టైగర్స్‌ మూడు బంతుల్లోనే విజయతీరాలకు చేరింది. బిపుల్‌ శర్మ బౌలింగ్‌లో డేనియల్‌ క్రిస్టియన్‌ సిక్సర్‌ బాది టైగర్స్‌ను గెలిపించాడు. 

చదవండి: బోణీ బాగుండాలి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement