source: X
స్వదేశంలో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జింబాబ్వే మహిళల జట్టుతో ఇవాళ జరుగుతున్న రెండో మ్యాచ్లో టీమిండియా బౌలర్లు రాణించారు. రాయ్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో జింబాబ్వేను స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది.
నికీ ప్రసాద్ 2 వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, నందిని శర్మ, దీప్తి శర్మ, శ్రీ చరణి తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. టిరిపానో 34, కెప్టెన్ నకోమో 27 (నాటౌట్) పరుగులు చేశారు. వారి ఇన్నింగ్స్లో ముగ్గురు డకౌట్లు కాగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
కాగా, ఈ సిరీస్లో జరిగిన తొలి మ్యాచ్లో విజయం సాధించి భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. టీ20 సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా జరుగనుంది. మూడో టీ20 అక్టోబర్ 20న ఇదే రాయ్పూర్ వేదికగా జరుగనుండగా.. వన్డే సిరీస్ మొత్తం వడోదరలో జరుగుతుంది. ఈ మ్యాచ్లు అక్టోబర్ 23, 25, 28 తేదీల్లో జరుగనున్నాయి.
ఇదీ చదవండి: ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా విజయం


