టీమిండియాతో మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌ | IND VS NZ: Injured Kane Williamson To Miss Third Test In Mumbai, Check More Details | Sakshi
Sakshi News home page

టీమిండియాతో మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌

Oct 29 2024 8:54 AM | Updated on Oct 29 2024 10:46 AM

IND VS NZ: Kane Williamson To Miss Third Test

టీమిండియాతో మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. గాయం కారణంగానే విలియమ్సన్‌ తొలి రెండు టెస్ట్‌లకు కూడా దూరమయ్యాడు. 

వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌ దృష్ట్యా విలియమ్సన్‌ను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంచామని కివీస్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. ప్రస్తుతం విలియమ్సన్‌ న్యూజిలాండ్‌లోనే రిహాబ్‌లో ఉన్నాడు. అతను మూడో టెస్ట్‌ కోసం భారత్‌కు రావడం​ లేదని కివీస్‌ మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది.

కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోకి తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్‌ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టెస్ట్‌ ముంబై వేదికగా నవంబర్‌ 1న ప్రారంభం కానుంది. 

చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌ విన్నర్‌

Advertisement
 
Advertisement
Advertisement