పెళ్లి మండపంలోనే వధూవరుల ఫైటింగ్‌.. వీడియో వైరల్‌! | Fierce Fight Breaks Between Bride And Groom On Wedding Mandap | Sakshi
Sakshi News home page

వివాహ వేదికపైనే వధూవరుల ఫైటింగ్‌.. బంధువులు షాక్‌!

Aug 8 2022 9:20 PM | Updated on Aug 8 2022 9:20 PM

Fierce Fight Breaks Between Bride And Groom On Wedding Mandap - Sakshi

వివాహ వేదికపైనే వధూవరులు ఇద్దరు తీవ్రంగా కొట్టుకుంటున్న వీడియో నెట్టింట్ల చక్కర్లు కొడుతోంది.  

పెళ్లి మండపంలో వధూవరులు కొత్తగా ప్రయత్నించి నవ్వులు పూయిస్తున్న వీడియోలు ఇటీవలి కాలంలో ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. అన్ని పెళ్లిళ్లు అలా నవ్వులు పూయించవు. వధూవరుల‍్లో ఎవరికైనా పెళ్లి ఇష్టంలేకపోతే.. చిన్న చిన్న వాటికే కసురుకుంటారు. ఎవరైనా ఏదైనా అంటే మీదపడిపోతుంటారు. అలాంటి వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే.. ఇక్కడ గొడవకు దిగింది వధూవరులే. వివాహ వేదికపైనే వధూవరులు ఇద్దరు తీవ్రంగా కొట్టుకుంటున్న వీడియో నెట్టింట్ల చక్కర్లు కొడుతోంది.  

వీడియోలో.. వరుడు కోపంతో తన చేతిని వధువు పైకి తీసుకెళ్లగా.. ఆమె దానిని అడ్డుకుంది. దాంతో ఆగ్రహించిన వధువు.. వరుడుపై సివంగిలా విరుచుకుపడింది. వెనకాల ఉన్నవారు ఆపేందుకు ప్రయత్నించినా వరుడికి చుక్కలు చూపించింది. అయితే.. వారి గొడవకు అసలు కారణాలేంటని తెలియరాలేదు. తేగుస్తి అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. కొందరు నెజిటన‍్లు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరికొందరు ఫైట్‌కు గల కారణాలను తెలుసుకనేందుకు ప్రయత్నించారు. పెళ్లి రోజునే గొడవకు దిగారంటే వారి బంధం ఎక్కువ రోజులు నిలవదని ఒకరు రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: Viral: 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేసిన రాజకీయ నేత.. అంత కోపం దేనికో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement