ఒకే వేదికపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు

Published Thu, Oct 26 2023 8:04 AM

- - Sakshi

జహీరాబాద్‌: దసరా వేడుకల్లో పాల్గొన్న ఆయా పా ర్టీల అభ్యర్థులు ఒకే వేదికను పంచుకున్నారు. మంగళవారం రాత్రి జహీరాబాద్‌ పట్టణంలోని శివాలయం వద్ద నిర్వహించిన రావణదహనం కార్యక్రమ వేడుకల్లో ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కె.మాణిక్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌ ఒకే వేదికను పంచుకొని ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్న ఢిల్లీ వసంత్‌, రాంచందర్‌ రాజనర్సింహా, సుధీర్‌కుమార్‌లు సైతం వారితో వేదికపై ఆశీనులయ్యారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా జరిగిన కార్యక్రమంలో దసరా పండుగ ప్రాముఖ్యత గురించి ఆయా పార్టీల అభ్యర్థులు, నేతలు వివరించారు. కార్యక్రమంలో ఐడీసీ చైర్మన్‌ ఎం.డి.తన్వీర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎం.శివకుమార్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఎం.జైపాల్‌రెడ్డి, వేడుకల కమిటీ చైర్మన్‌ అల్లాడి వీరేశం, బీఆర్‌ఎస్‌ నాయకులు మంకాల్‌ సుభాష్‌, జి.గుండప్ప, విజయ్‌కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు మురళీ కృష్ణాగౌడ్‌, ఎం.జి.రాములు, బీజేపీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

రావణదహనంలో పాల్గొన్న నేతలు

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement