9,11,255 | Sakshi
Sakshi News home page

9,11,255

Published Wed, May 15 2024 7:50 AM

9,11,255

మంది ఓటెయ్యలే!

తీరు మారని పట్టణ ప్రాంత ఓటర్లు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈసారి ఉమ్మడి జిల్లా పరి ధిలో 9,11,255 మంది ఓటు వేయలేదు. మొత్తం 13 నియోజకవర్గాల్లో 32,26,474 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కరీంనగర్‌ ఎంపీ సెగ్మెంట్‌లో 17,97,150 మంది, పెద్దపల్లి పార్లమెంట్‌ పరి ధిలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9,47,400 మంది(చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లిలను మినహాయించి), నిజామాబాద్‌ పరిధిలోని కోరుట్ల, జగిత్యాలలో కలిపి 4,81,924 మంది ఓటర్లు ఉన్నా రు. అయితే, కరీంనగర్‌లో 4,93,460, నిజామాబాద్‌లో 1,26,215, పెద్దపల్లి పరిధిలో 2,91,580 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వీరిలో అధికంగా పట్టణ ప్రాంత ఓటర్లే కావడం గమనార్హం. ప్రధానంగా హుజూరాబాద్‌, హుస్నాబాద్‌, ధర్మపురి, రామగుండం, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ఎక్కువ మంది ఓటు వేయలేదు.

అసెంబ్లీతో పోలిస్తే తగ్గింది..

2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు, తాజా పార్లమెంట్‌ ఎన్నికలకు దాదాపు సగటున మూడుశాతం పోలింగ్‌ తగ్గింది. కరీంనగర్‌లో రెండు, చొప్పదండిలో రెండు, వేములవాడలో మూడు, సిరిసిల్లలో మూడు, మానకొండూరులో నాలుగు, హుజూరాబాద్‌లో 10, హుస్నాబాద్‌లో ఏడుశాతానికి పైగా, ధర్మపురిలో ఐదు, రామగుండంలో రెండు, మంథనిలో రెండు, పెద్దపల్లిలో 10 శాతానికి మించి ఓటింగ్‌లో తగ్గుదల నమోదవడం గమనార్హం. కోరుట్లలో రెండు, జగిత్యాల రెండుశాతం కన్నా ఎక్కువ వ్యత్యాసం కనిపించింది.

పెరిగిన పర్సంటేజీ..

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో పోలింగ్‌ శాతం పెరిగింది. 2019లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే 3.24 శాతానికి పైగా నమోదుకావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా పరిధిలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్లలో విస్తరించి ఉన్నాయి. కరీంనగర్‌లో 72.54, పెద్దపల్లిలో 68.80, నిజామాబాద్‌లో 71.74 శాతం పోలింగ్‌ జరిగింది. ఎన్నికల సంఘం ప్రసార మాధ్యమాలతోపాటు, సోషల్‌ మీడియాలో చేసిన ప్రచారంవల్లే ఇది సాధ్యమైంది. యువత ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొనడం పోలింగ్‌ శాతం పెరగడానికి కారణమైంది.

ఈసారి పెరిగిన యువత భాగస్వామ్యం

మెరుగ్గా ‘పార్లమెంట్‌’ పోలింగ్‌శాతం

2019 ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో 3.24 శాతానికి పైగా నమోదు

ఫలించిన ఎలక్షన్‌ కమిషన్‌ ప్రచారం

Advertisement
 
Advertisement
 
Advertisement