అదుపుతప్పి కారు బోల్తా | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి కారు బోల్తా

Published Wed, Nov 15 2023 1:30 AM

-

చందుర్తి(వేములవాడ): మండలంలోని మర్రిగడ్డ శివారులో మంగళవారం రాత్రి కారు అదుపుతప్పి బోల్తాపడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మ ర్రిగడ్డ నుంచి వేములవాడ వైపు వెళ్తున్న కారు అదుపుత ప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు ఓ యువతి ఉన్నట్లు సమాచారం. డ్రైవర్‌తో పాటు యువతి స్వల్ప గాయాలతో ఘటన స్థలం నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్సై అశోక్‌ తన సిబ్బందితో హుటాహుటినా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలో ఎవరూ లేకపోవడంతో కారు రి జిస్ట్రేషన్‌ నంబర్‌కు లింకై నా ఫోన్‌ నంబర్‌కు ఎస్సై కాల్‌ చేయగా స్వీచాఫ్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కారు నంబర్‌ రిజిస్ట్రేషన్‌ అడ్రస్‌ మాత్రం వేములవాడ రూరల్‌ మండలం రుద్రవరం గ్రామానికి చెందినదిగా గు ర్తించా రు. అయితే ప్రమాద సమయంలో కారులో ఉన్నవారు ఎవరనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది.

Advertisement
Advertisement