టీడీపీ అరాచకాలపై పోరాడుతాం: కాసు మహేష్‌రెడ్డి | YSRCP Leader Kasu Mahesh Reddy Slams TDP Leaders Over Alleged Harassment Of Party Candidates In Palnadu | Sakshi
Sakshi News home page

టీడీపీ అరాచకాలపై పోరాడుతాం: కాసు మహేష్‌రెడ్డి

Oct 17 2026 10:52 AM | Updated on Oct 17 2026 11:36 AM

Ysrcp Leader Kasu Mahesh Reddy Fires On Tdp Leaders

సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో పోలీసులను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. ఇవాళ  వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి రెడీ అయ్యారు. పోలీసులు రౌడీలా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అక్రమ అరెస్టు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న వైఎస్సార్‌సీపీ దాచేపల్లి  చైర్మన్ అభ్యర్థి రవిని అరెస్టు చేశారు. రాత్రి గురజాల చైర్మన్ అభ్యర్థి పోలు వీరారెడ్డిని అక్రమ అరెస్టు చేశారు. మాకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకుల అరాచకాలపై కోర్టులో పోరాడుతాం. నామినేషన్ సెంటర్లను టీడీపీ గట్టిగా ఉన్న ప్రాంతాల్లో పెట్టుకున్నారు. గురజాల చైర్మన్ అభ్యర్థి పోలు వీరారెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు మురళీధర్ రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు’’ అని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement