Vallabhaneni Vamsi Political Counter Attack On TDP Chandrababu - Sakshi
Sakshi News home page

టీడీపీ ఎప్పటికైనా జూనియర్‌ ఎన్టీఆర్‌ పార్టీనే: వంశీ 

Feb 25 2023 6:57 PM | Updated on Feb 25 2023 7:49 PM

Vallabhaneni Vamsi Political Counter Attack On TDP Chandrababu - Sakshi

చంద్రబాబు.. బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా చూసినట్లన్నాడు. అందుకే బాలయ్య సినిమా డైలాగులు చెబుతున్నాడు. 

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్‌ ఇచ్చారు. ఓ పని చంద్రబాబు చేసే సంసారం.. వేరే వారు చేస్తే మరొకటా? అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కావాలనుకుంటే గన్నవరం కాకపోతే అసోం కూడా వెళ్లొచ్చు అంటూ సెటైరికల్‌ పంచ్‌ ఇచ్చారు. 

కాగా, వంశీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సెక్షన్‌ 144, 30 అమలులో ఉన్నప్పుడు పోలీసులు ఎవరినైనా నియంత్రిస్తారు. చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లొచ్చు. నడుముకి రాకెట్ కట్టుకుని పైకెళ్లొచ్చు.. గోదాట్లో దూకి కుక్కతోక పట్టుకుని ఈదొచ్చు.  ముద్రగడను ఇంట్లోంచి బయటకు రాకుండా మూడేళ్లు నియంత్రించారు. మందకృష్ణ మాదిగను ఏపీలోకి రాకుండా ఐదేళ్లు నియంత్రించారు. అప్పుడు ఏ రాజ్యాంగం ప్రకారం చంద్రబాబు చేశాడు?. చంద్రబాబు చేస్తే సంసారం.. వేరే వారు చేస్తే మరొకటా?. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాననడం బాధాకరం. చంద్రబాబు.. బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా చూసినట్లన్నాడు. అందుకే బాలయ్య సినిమా డైలాగులు చెబుతున్నాడు. 

జూనియర్‌ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాలని లోకేష్‌ పిలవడం అతిపెద్ద జోక్‌.  టీడీపీ ఎప్పటికైనా ఎన్టీఆర్‌ పార్టీనే. లోకేష్‌కు బొడ్డు ఊడనప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీకి ప్రచారం చేశారు. వాళ్ల తాతగారి పార్టీని జూనియర్‌ ఎన్టీఆర్‌ చూసుకోగలడు. తిరుపతిలో శిశువుల డాక్టర్‌ను చంద్రబాబు మోసం చేసిన కథ బయటపెడతాను’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు.   

Advertisement
 
Advertisement
Advertisement