రాహుల్‌ గాంధీపై శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు | Shiv Sena MLA Sanjay Gaikwad Controversial Comments On Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీపై శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Sep 16 2024 3:48 PM | Updated on Sep 16 2024 4:13 PM

Shiv Sena MLA Sanjay Gaikwad Controversial Comments On Rahul Gandhi

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ నాలుక కోసిన వారికి రూ, 11 లక్షలు బహుమతిగా ఇస్తానని శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ ప్రకటించారు. అయితే రిజర్వేషన్లపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే ఈ ప్రకటన చేశారు.

“ఇటీవల అమెరికా పర్యటనలో భారత్‌లో రిజర్వేషన్‌లను అంతం చేయడం గురించి రాహుల్ గాంధీ మాట్లాడారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ చేసిన ప్రకటించడం.. ప్రజలకు చెప్పిన అతిపెద్ద అబద్ధం. ఓవైపు మహారాష్ట్రలో రిజర్వేషన్ల డిమాండ్లు పెరుగుతున్నాయి. కానీ అక్కడ  దేశంలో రిజర్వేషన్లను తొలగిస్తామని ప్రకటన చేశారు. దేశం నుంచి రిజర్వేషన్లను దూరం చేస్తామంటూ రాహుల్‌ మాటాలతో  కాంగ్రెస్‌ నిజ స్వరూపం బయటపడింది. రాహుల్‌ నాలుకను ఎవరు నరికినా, వారికి  11 లక్షల రూపాయల బహుమతి ఇస్తాను’ అని గౌక్వాడ్‌ ప్రకటించారు.

అయితే మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ, శివసేన భాగస్వామ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే గైక్వాడ్‌ వ్యాఖ్యలపై ఇటు బీజేపీ కానీ, అటుశివసనే కానీ స్పందించలేదు. కాగా గైక్వాడ్‌ విధర్బలోని బుల్దానా అసెంబ్లీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ ఎమ్మెల్యేకు వివాదాలు కొత్తేమీ కాదు.

 గత నెలలో ఓ పోలీసు అధికారి గౌక్వాడ్‌ కారును శుభ్రం చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారడంతో వివాదంగా మారింది. అయితే దీనిని ఎమ్మెల్యే సమర్ధించుకున్నారు. కారులో అనుకోకుండా కారులో వాంతులు చేసుకోవడంతో ఆ పోలీసు స్వచ్ఛందంగా దాన్ని శుభ్రం చేశాడని చెప్పుకొచ్చారు. అంతేగాక 1987లో ఓ పులిని వేటాడి దాని దంతాన్ని నెక్లెస్‌గా ధరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్ర అటవీశాఖ ఫోరెన్సిక్‌ ఆ దంతాన్ని పరీక్షించి.. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement