హైదరాబాద్‌కు కిషన్‌ రెడ్డి ఏం తెచ్చాడు?: మంత్రి పొన్నం ఫైర్‌ | Minister Ponnam Prabhakar Political Counter To KTR And Kishan Reddy, More Details Inside | Sakshi
Sakshi News home page

కేటీఆర్ ఓ అసమర్థుడు: మంత్రి పొన్నం ఫైర్‌

Jul 11 2024 2:29 PM | Updated on Jul 11 2024 4:00 PM

Minister Ponnam Prabhakar Political Counter To KTR And Kishan Reddy

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు ఏం తెచ్చాడు? అని ప్రశ్నించారు మంత్రి పొన్నం  ప్రభాకర్‌. అలాగే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఓ అసమర్థుడు అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

కాగా, మంత్రి పొన్నం తాజాగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌కు కౌంటరిచ్చారు. మంత్రొ పొన్నం ప్రభాకర్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాద్‌ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసేలా కిషన్‌రెడ్డి మాట్లాడటాన్ని ఖండిస్తున్నాను. హైదరాబాద్‌కు కిషన్‌ రెడ్డి ఏం తెచ్చాడు?. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేశాయి.

తెలంగాణకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం.  కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కాగానే హైదరాబాద్ ఇంచార్జీ మంత్రిగా కలిశాను. కేటీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాడు. కేటీఆర్ పెద్ద అసమర్థుడు. హైదరాబాద్ అస్తవ్యస్తం కావడానికి కారణం కేటీఆరే. ఉద్యోగ క్యాలెండర్ తప్పకుండా ఇస్తాం. ఉద్యోగ నియామకాలు జాప్యం అవుతున్నాయని మొన్నటి వరకు ప్రశ్నించి, ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయండి అంటున్నారు. రాజకీయ నాయకుల ఉచ్చులో విద్యార్థులు పడకండి. విద్యార్థుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరిస్తాం’ అని కామెంట్స్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement