శ్వేతపత్రం కాదు.. మా కేసుల సంగతి చూడండి! | Appeal Of MLAs Of TDP Alliance In Legislative Assembly Sessions | Sakshi
Sakshi News home page

శ్వేతపత్రం కాదు.. మా కేసుల సంగతి చూడండి!

Jul 26 2024 8:44 AM | Updated on Jul 26 2024 10:34 AM

Appeal Of MLAs Of TDP Alliance In Legislative Assembly Sessions

సభలో కూటమి ఎమ్మెల్యేల విజ్ఞప్తి

శ్వేతపత్రంపై అభిప్రాయాలు చెప్పమంటే కోరికల చిట్టా

పాత కేసులు కూడా ఎత్తివేయాలని వినతి

సాక్షి, అమరావతి: శాసన సభ సమావేశాల్లో గురువారం విచిత్ర పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభ్యులు చర్చించేందుకు స్పీకర్‌ అవకాశం కల్పించగా.. దొరికిందే ఛాన్సన్నట్లుగా సభ్యులు కేసులు ఎత్తేయాలని కోరడం కొసమెరుపు.  

శ్వేత పత్రాల సంగతి తర్వాత చర్చించాలని కోరుతూ చాలామంది ఎమ్మెల్యేలు.. కోరికల చిట్టా విప్పారు. పాత కేసులు కూడా ఎత్తేయాలని కోరారు. తమ ఒక్కరిపై ఉన్న కేసులంటేనే బాగోదని భావించి, పార్టీ కార్యకర్తల పైన ఉన్న కేసులూ ఎత్తేయాలని చెప్పారు. ఒక సందర్భంలో సభలో కేసులున్న సభ్యులు లేచి నిల్చోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరగా.. దాదాపు 90 శాతం సభ్యులు లేచి నిలబడ్డారు. వీళ్లలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement