అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రైళ్లు | Sakshi
Sakshi News home page

అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రైళ్లు

Published Thu, Nov 23 2023 2:24 AM

-

ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే సీనియర్‌ డీసీఎం త్రిపాఠి

విజయనగరం టౌన్‌: అయ్యప్ప భక్తులకు రైల్వేశాఖ ప్రత్యేక రైలు సదుపాయం కల్పించింది. సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కె.త్రిపాఠి మంగళవారం ఓ ప్రకటనలో రైలు వివరాలు వెల్లడించారు. రైల్వే డీఆర్‌ఎమ్‌ సౌరభ్‌ ప్రసాద్‌ చొరవతో శ్రీకాకుళం నుంచి కొల్లం, విశాఖ నుంచి కొల్లాం వరకూ 40 ట్రిప్‌లు ప్రత్యేక రైలు తిరుగుతుందన్నారు. రైలు నంబర్‌ 08537 శ్రీకాకుళం రోడ్డు– కొల్లాం వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ శ్రీకాకుళం రోడ్డులో నవంబర్‌ 25 నుంచి జనవరి 27 వరకూ ప్రతి శనివారం 11 గంటలకు బయలుదేరి దువ్వాడ మధ్యాహ్నం 1.42కి చేరుకుంటుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు కొల్లాం చేరుతుంది.

తిరుగు ప్రయాణంలో రైలు నంబర్‌ 08538 కొల్లాం–శ్రీకాకుళం రోడ్డు వీక్లీ స్పెషల్‌ కొల్లాంలో ఆదివారం రాత్రి 7.35 గంటలకు నవంబర్‌ 26 నుచి జనవరి 28 వరకూ బయలు దేరుతుంది. మరుసటి రోజు రాత్రి 11 గంటలకు దువ్వాడ, వేకువజామున 2 గంటలకు శ్రీకాకుళం చేరుతుంది. ఈ ప్రత్యేక రైలు చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, మీదుగా వెళ్తుంది. ఒక సెకెండ్‌ ఏసీ, నాలుగు థర్డ్‌ ఏసీ, పది స్లీపర్‌ బోగీలు, ఐదు సెకెండ్‌ క్లాస్‌ సిటింగ్‌, రెండు సెకెండ్‌ క్లాస్‌ సిటింగ్‌ కమ్‌ లగేజ్‌ కోచ్‌లు ఉంటాయి. అలాగే, విశాఖ నుంచి కొల్లాంకు ప్రత్యేక రైలు ఏర్పాటుచేశారు. రైలు నెంబర్‌ 08539 విశాఖ–కొల్లాం స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌, నవంబర్‌ 29 నుంచి జనవరి 31 వరకు ప్రతి బుధవారం విశాఖలో బయలుదేరి, గురు వారం మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్‌ 08540 కొల్లాం–విశాఖ వీక్లీ స్పెషల్‌ నవంబర్‌ 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు కొల్లాంలో గురువారం రాత్రి 19.35 గంటలకు బయలుదేరి శుక్రవారం రాత్రి 11.20 గంటలకు విశాఖ చేరుతుంది. రైలు దువ్వాడ, సామర్లకోట, ఏలూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఆగుతుంది.

విజయనగరం రూరల్‌:

సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ వన్‌స్టాప్‌ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు సిబ్బందికి జెడ్పీనిధుల నుంచి సబ్జెక్టు టు రీయింబర్స్‌మెంట్‌ పద్ధతిపై జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు వేతనాలు అందజేశారు. వన్‌స్టాప్‌ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు ఆలస్యమైన విషయం జెడ్పీ చైర్మన్‌ దృష్టికి వచ్చింది. ఆయన వెంటనే స్పందించి జెడ్పీ నిధుల నుంచి రూ.4.3 లక్షలను మంగళవారం తన కార్యాలయంలో అందజేశారు.

కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, జెడ్పీ సీఈఓ కె.రాజ్‌కుమార్‌, ఐసీడీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement