3 రోజుల పాపకు అరుదైన వెన్నెముక శస్త్రచికిత్స | Sakshi
Sakshi News home page

3 రోజుల పాపకు అరుదైన వెన్నెముక శస్త్రచికిత్స

Published Thu, May 23 2024 3:25 AM

3 రోజుల పాపకు అరుదైన వెన్నెముక శస్త్రచికిత్స

శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళంలోని గ్లోబల్‌ న్యూరోకేర్‌ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్‌ దేవరెడ్డి గౌతమ్‌(న్యూరోసర్జన్‌) బుధవారం మూడు రోజుల పాపకు అరుదైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. గార మండలం కొర్ని గ్రామానికి చెందిన ప్రగడ చిన్నబాబు, శ్రీలత దంపతులకు మూడు రోజుల క్రితం పాప జన్మించింది. చిన్నారికి వెన్నెముక నరాలు బయటకు వచ్చాయి. దీనిని వైద్య పరిభాషలో మెనిం గోమైలోసీల్‌గా పేర్కొంటారు. ఈ నరాలను సరి చేసేందుకు అనస్థీషియాలజిస్ట్‌ డా.గొనప భవానీ నేతృత్వంలో డా.దేవరెడ్డి గౌతమ్‌ ఆధ్వర్యంలో నాలుగు గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గౌతమ్‌ మాట్లాడుతూ 2.5కేజీల బరువు గ ల పాపకు ఇటువంటి ఆపరేషన్‌ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని, పూర్తిగా మైక్రోస్కోపిక్‌ సర్జరీ చేయడంతో చక్కని ఫలితం లభించిందని తెలిపారు. శస్త్ర చికిత్సకు సహకరించిన డాక్టర్‌ సీపా న రాజేష్‌, డాక్టర్‌ రామకోటేశ్వర రావు(నియోటేలాలజిస్ట్‌)లకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement