క్షేత్రపర్యటనలో 150 మంది రైతులు | Sakshi
Sakshi News home page

క్షేత్రపర్యటనలో 150 మంది రైతులు

Published Mon, Apr 8 2024 1:05 AM

వన్నెల(కే) ఎత్తిపోతల పథకం వద్ద ఎమ్మెల్యే, రైతులు  
 - Sakshi

● ప్రత్యేక వాహనాల్లో వన్నెల్‌(కే) గ్రామానికి.. ● అక్కడి సాగు విధానాలపై అవగాహన ● చొరవచూపిన ఎమ్మెల్యే రామారావుపటేల్‌

భైంసాటౌన్‌: ముధోల్‌ నియోజకవర్గ రైతులు సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం వన్నెల్‌(కే) గ్రామ రైతులు అక్కడి ఎత్తి పోతల పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అ ధిక దిగుబడులు సాధిస్తున్న తీరుపై ఇక్కడి రైతుల కు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలోని బ్రహ్మన్‌గావ్‌, ఆష్ట, గన్నోరా, కనకాపూర్‌, అబ్దుల్లాపూర్‌, వడ్తల్‌, జోర్‌పూర్‌, గోడిసెర, చింతకుంట, లోకేశ్వరం, పిప్రి, ధర్మోరాకు చెందిన దాదాపు 150 మంది రైతులతో ఆదివారం ప్రత్యేక వాహనాల్లో వన్నెల్‌(కే) గ్రామానికి వెళ్లారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సహకారంతో అక్కడి ఎత్తిపోతల పథకాన్ని రైతులతో కలిసి సందర్శించారు. అక్కడి రైతులు సాగు చేస్తున్న పంటలు, సాగు విధానాలు పరిశీలించారు. అనంతరం అక్కడి రైతులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్‌ మాట్లాడు తూ.. వన్నెల్‌(కే) గ్రామ రైతులు ఎత్తిపోతల పథకా లను వినియోగించుకుంటూ ఏటా రెండు పంటలు తీస్తున్నారని తెలిపారు. ముధోల్‌ నియోజకవర్గంలో గోదావరినది పరీవాహక ప్రాంత గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తెచ్చి రైతులకు మేలు చేసే దిశగా తనవంతు కృషి చేస్తానని చెప్పా రు. ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు సంఘటితంగా నిర్ణయాలు తీసుకుంటే వ్యవసాయరంగంలో పురోగతి సాధించవచ్చని తెలిపారు. ఎమ్మె ల్యే వెంట బీజేపీ నాయకులు రమేశ్‌, వెంగల్‌రావు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ చైర్మన్‌ రాజారెడ్డి, రైతులున్నారు.

Advertisement
Advertisement