మోదీ కానుక: గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా తగ్గింపు | Womens Day Gift Centre Brings down LPG cylinders Price | Sakshi
Sakshi News home page

ఉమెన్స్‌ డే కానుక: గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా తగ్గింపు

Mar 8 2024 9:10 AM | Updated on Mar 8 2024 11:32 AM

Womens Day Gift Centre Brings down LPG cylinders Price - Sakshi

గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా తగ్గిస్తూ మోదీ ప్రభుత్వం..

సాక్షి, ఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.100 తగ్గించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ‍ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. 

కాగా, నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త అందించారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.100 తగ్గిస్తున్నట్టు ట్విట్టర్‌ వేదికగా మోదీ తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ‘ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది. వంట గ్యాస్‌ ధరను తగ్గించడంతో ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారికి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను అందించడానికి అనుగుణంగా ఉంటుంది’ అని వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement