ఇదేంది మామా ఇది.. కొంచెం ఉంటేనా.. | Tamil nadu Tuticorin road accident Video Viral | Sakshi
Sakshi News home page

ఇదేంది మామా ఇది.. కొంచెం ఉంటేనా..

Oct 11 2026 12:54 PM | Updated on Oct 11 2026 12:54 PM

Tamil nadu Tuticorin road accident Video Viral

ప్రశాంతంగా టీ తాగుతున్నాడు.. చుట్టూ అంతా మామూలుగానే ఉంది.. ఇంతలోనే ఒక్కసారిగా దూసుకొచ్చిన కారు అక్కడి పరిస్థితిని తలకిందులు చేసింది. రెప్పపాటులో అతడిని ఢీకొట్టింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రమాదం జరిగిపోయింది. ఈ భయానక ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో సాత్తాన్‌కుళం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ టీ దుకాణం బయట టీ తాగుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. సాధారణంగా కనిపించిన ఆ క్షణాలు.. ఒక్కసారిగా ప్రమాదకరంగా మారిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కాసేపు ఆగి టీ తాగుతున్న వ్యక్తికి ఇలాంటి ప్రమాదం ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే ప్రమాదంలో అతడికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో కారు వేగం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఖంగితిని షాక్‌ కొట్టిన విధంగా చూస్తూ ఉండిపోయారు. 

Video credit.. Polimer News

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement