ఊపిరి తీసిన హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ | Cosmetic Surgery Clinic In Mangaluru Temporarily Shut After Patient Death, More Details Inside | Sakshi
Sakshi News home page

ఊపిరి తీసిన హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌

Sep 26 2024 8:49 AM | Updated on Sep 26 2024 10:21 AM

Cosmetic Surgery Clinic in Mangaluru temporarily shut after patient death

దొడ్డబళ్లాపురం: జట్టు రాలిపోయి అందం చెడిపోతోంది, హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకుని బాగా కనిపించాలని అనుకున్న యువకుడు ప్రాణాలే కోల్పోయాడు. కాస్మెటిక్‌ సర్జరీలు వికటిస్తే ఫలితం ఘోరంగా ఉంటుందనేందుకు మరో ఉదంతం తోడైంది. ఈ సంఘటన మంగళూరులో చోటుచేసుకుంది. 

స్థానిక అక్కరెకెరె నివాసి మహమ్మద్‌ మాజీన్‌కు జుట్టు రాలిపోయే సమస్య ఉంది. దీంతో మంగళూరు బెందోర్వెల్‌లో ఉన్న ఫ్లోంట్‌ కాస్మెటిక్‌ సర్జరీ– హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ క్లినిక్‌లో సంప్రదించాడు. అక్కడ నిపుణులు అతనికి హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ చేస్తుండగా మహమ్మద్‌ ఆరోగ్యం విషమించింది. వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతిచెందాడు. నిపుణుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

Advertisement
 
Advertisement
Advertisement