సుదీర్ఘ పోరుకు సిద్ధం కావాలి! | CJP Saurav Das intimates Delhi police about Oct 10 protest at Jantar Mantar | Sakshi
Sakshi News home page

సుదీర్ఘ పోరుకు సిద్ధం కావాలి!

Oct 8 2026 4:27 AM | Updated on Oct 8 2026 4:27 AM

CJP Saurav Das intimates Delhi police about Oct 10 protest at Jantar Mantar

10న జరిగే నిరసన కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలిరావాలి 

ప్రజలకు విద్యార్థి సంఘాల పిలుపు  

న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) సహా పలు విద్యార్థి సంఘాలు తేల్చిచెప్పాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఈ నెల 10న జరగనున్న నిరసనకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చాయి. ఆయా సంఘాల నేతలు బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 

ఓట్ల చోరీ విషయంలో ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి సాగిస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. మీడియా సమావేశంలో సీజేపీ, ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌(ఏఐఎస్‌ఏ), ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌(ఏఐఎస్‌ఎఫ్‌), స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ) ప్రతినిధులు పాల్గొన్నారు.  ప్రజలంతా స్వచ్ఛందంగా ఢిల్లీకి తరలిరావాలని, సుదీర్ఘ పోరాటానికి సన్నద్ధం కావాలని సీజేపీ కో–కనీ్వనర్‌ సౌరవ్‌ దాస్‌ పిలుపునిచ్చారు. 

ప్రజాప్రతినిధులు వీధుల్లోకి రావాలి: నేహా బోరా  
విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమానికి, ప్రతిపక్ష పార్టీల నిరసనలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని ఏఐఎస్‌ఏ అధ్యక్షురాలు నేహా బోరా అన్నారు. సామాన్య ప్రజలు, పౌర సమాజం, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఒకవైపు ఉండగా.. ఎన్నికల సంఘం, బీజేపీ మరోవైపు ఉన్నాయని చెప్పారు. మన పోరాటాన్ని మనం ఐక్యంగా ముందుకు నడిపించాలని పేర్కొన్నారు.

 ప్రజల సమస్యలను లేవనెత్తి, వారి హక్కులను పరిరక్షించడానికి ప్రజాప్రతినిధులు వీధుల్లోకి రావాల్సిన బాధ్యత ఉందని కోరారు. అక్టోబర్‌ 10న జరగనున్న నిరసన కార్యక్రమానికి సీజేపీ, ప్రతిపక్ష పార్టీల విద్యార్థి సంఘాలు మద్దతునిస్తున్నాయని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుకుంటున్న ప్రజలతో చేతులు కలపాలని బీజేపీ నేతలకు, కార్యకర్తలకు నేహా బోరా పిలుపునిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement