Car Stunt on Delhi Meerut Expressway - Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై కారు స్టంట్స్‌.. యువకుల పిచ్చి చేష్టలు.. వీడియో వైరల్‌..

Aug 8 2023 6:12 PM | Updated on Aug 8 2023 6:36 PM

Car Stunt On Delhi Meerut Expressway - Sakshi

ఢిల్లీ: ఢిల్లీ-మీరట్ జాతీయ రహదారిపై కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు. దేశ ప్రధాన రహదారిపై కారుతో చక్కర్లు కొడుతూ తోటి ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించారు. రద్దీగా ఉండే రహదారిపై యువకుల చేష్టలతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. 

వీడియోలో చూపిన విధంగా కొందరు యువకులు కారులో ప్రయాణిస్తున్నారు. అయితే.. సవ్యమైన దిశలో కాదు. రోడ్డుకు అడ్డంగా చక్కర్లు కొట్టారు. 25 సెకన్ల వీడియోలో చూపిన విధంగా రౌండ్లు వేస్తూ ఇతర ప్రయాణికులు వెళ్లకుండా ఇబ్బంది కలిగించారు. వీడియోలో యువకుల పిచ్చి చేష్టలకు భయపడిన తోటి ప్రయాణికులు కాసేపు ఎటూ వెళ్లకుండా అక్కడే నిలుచుని ఉండిపోయారు. 

కారులో ఇద్దరు యువకులు బయటికి వేలాడారు. మరో ఇద్దరు కారులో కూర్చున్నారు. కనీసం జాతీయ రహదారి అనే జ్ఞానం లేకుండా రోడ్డుపై అడ్డంగా చక్కర్లు కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. పోలీసులు స్పందించారు. దోషులకు శిక్ష తప్పదని చెప్పారు.  

ఇదీ చదవండి: వీల్ ఛైర్‌లో మన్మోహన్‌సింగ్‌.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement