ఎవరీ బీజేపీ లీడర్?..భద్రతా దళాలతో మంచులో రన్నింగ్‌! వీడియో వైరల్‌ | BJP Leader Draws Opposition Fire For Snow Video | Sakshi
Sakshi News home page

ఎవరీ బీజేపీ లీడర్?..భద్రతా దళాలతో మంచులో రన్నింగ్‌

May 5 2025 6:25 PM | Updated on May 5 2025 7:22 PM

BJP Leader Draws Opposition Fire For Snow Video

న్యూఢిల్లీ:  పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ.. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు భద్రతా సిబ్బందితో మంచులో పరుగెడుతూ దాని వెనుక బ్యాక్ గ్రౌండ్‌లో ఓ బాలీవుడ్ సాంగ్ ‍ ప్లే అవుతున్న వీడియో ఇప్పుడు  విశేషంగా వార్తల్లో నిలిచింది.

ఎవరీ బీజేపీ లీడర్?
రవీందర్ రైనా..  బీజేపీలో సీనియర్ నాయకుడు. జమ్మూ కశ్మీర్ బీజేపీ మాజీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే ఈయన. అయితే ఎప్పుడు వార్తల్లో పెద్దగా కనిపించని రవీందర్ రైనా.. ఒక్కసారిగా హాట్ టాపిక్ గా నిలిచారు. ఒ​క బృదం భద్రతా బలగాల్ని వెంట బెట్టుకుని ఆయన కూడా మంచులో పరుగెడుతూ కనిపించారు.  దీనికి సంబంధించిన షార్ట్ వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది వైరల్ గా మారింది.

 

మండిపడ్డ కాంగ్రెస్‌
దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భద్రతా బలగాల్ని ఈ తరహాలో ఉపయోగించుకుంటారా అంటూ మండిపడింది.  ఈ వీడియోపై సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినాతే  ధ్వజమెత్తారు. పహల్గామ్ దాడి తర్వాత దేశం అంతా తీవ్ర శోకంలో ఉంటే ఇలా చేయడం సమంజసం కాదంటూ విమర్శించారు. పహల్గామ్  ఉగ్రదాడిలో కొంతమంది తన కుమారుల్ని కోల్పోగా, మరికొంతమంది తల్లిదండ్రుల్ని, పలువురు భర్తల్ని కోల్పోయారు. మరి ఈయన అయితే మంచి రిథమ్ లో ఉన్నారు. రీల్స్ షూటింగ్ చేసుకుంటున్నారు. భద్రతా సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన చర్య’ అంటూ మండి పడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement