సూర‌త్‌లో కుప్ప‌కూలిన ఆరు అంతస్తుల బిల్డింగ్‌.. 15 మందికి గాయాలు | 6 Storey Building Collapses In Gujarat; 15 Injured Many Feared Trapped | Sakshi
Sakshi News home page

సూర‌త్‌లో కుప్ప‌కూలిన ఆరు అంతస్తుల బిల్డింగ్‌.. 15 మందికి గాయాలు

Jul 6 2024 6:51 PM | Updated on Jul 6 2024 7:16 PM

6 Storey Building Collapses In Gujarat; 15 Injured Many Feared Trapped

గాంధీన‌గ‌ర్‌: గుజ‌రాత్‌లోని  సూర‌త్‌లో ఓ బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో స‌చిన్ పాలి గ్రామంలో ఆరు అంత‌స్థుల భ‌వ‌నం కూలింది. ఈ ఘ‌ట‌న‌లో భ‌వ‌నంలోని ప‌లువురు చిక్కుకున్నారు. దాదాపు ప‌దిహేను మంది గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌కశాఖ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. 

బిల్డింగ్‌  కాంక్రీట్ బండ‌ల‌ కింద ఎవ‌రైనా చిక్కుకొని ఉండ‌చ్చ‌ని గాలిస్తున్నారు. శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. భ‌వ‌నం శిథిలావ‌స్థ‌లో ఉంద‌ని, దానికి తోడు భారీ వ‌ర్షాల‌తో  కూలింద‌ని అధికారులు తెలిపారు. ఘ‌ట‌నా స్థ‌లంలో బిల్డింగ్ కూలిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement