పెరుగు ప్యాకెట్‌కు వెళ్లి.. | Sakshi
Sakshi News home page

పెరుగు ప్యాకెట్‌కు వెళ్లి..

Published Wed, May 15 2024 5:45 AM

పెరుగు ప్యాకెట్‌కు వెళ్లి..

బస్సు ఢీకొనడంతో ప్రాణాలు

కోల్పోయిన ఒడిషా యువకుడు

తూప్రాన్‌పేట శివారులో ఘటన

చౌటుప్పల్‌ : తెచ్చుకున్న సరుకులోని పెరుగు ప్యాకెట్‌ రోడ్డుపై పడిపోవడంతో దానిని తీసుకొచ్చేందుకు వెళ్లిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని తప్రాన్‌పేట శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తూప్రాన్‌పేట గ్రామశివారులో ఆగస్థ్య ఆగ్రో లిమిటెడ్‌ కంపెనీలో ఒడిషా రాష్ట్రంలోని రాయఘడ్‌ జిల్లాకు చెందిన నికోలస్‌ సభర్‌(28)తో పాటు రుమీల్‌ సభర్‌, రాహుల్‌ సభర్‌, సిభాలు కొంతకాలంగా పనిచేస్తున్నారు. అందరూ కలిసి స్థానికంగానే నివాసం ఉంటున్నారు. సొంతంగా వంట చేసుకునే ఈ నలుగురు మంగళవారం ఉదయం 8గంటల ప్రాంతంలో సమీపంలోని కొత్తగూడకు వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకున్నారు. కంపెనీ ఎదురుగా జాతీయ రహదారిని దాటారు. అదే సమయంలో తమ వెంట తెచ్చుకున్న సరుకుల సంచిలో నుంచి ఓ పెరుగు ప్యాకెట్‌ రోడ్డుపై పడిపోవడాన్ని వారు గుర్తించారు. వెంటనే నికోలస్‌ సభర్‌ అనే యువకుడు పడిపోయిన పెరుగు ప్యాకెట్‌ కోసం మళ్లీ రోడ్డు దాటుకుంటూ వెళ్లాడు. పెరుగు ప్యాకెట్‌ తీసుకొని అక్కడే రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌కు రాంగ్‌రూట్‌లో వెళ్తున్న టీఎస్‌08 యూబీ 8184 గల ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్నేహితులు చికిత్స నిమిత్తం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కళ్ల ఎదుటే స్నేహితుడు రో డ్డు ప్రమాదానికి గురై మృతిచెందడంతో సహచరులు బోరున విలపించారు. అజాగ్రత్తగా, అతివేగంగా బస్సును నడిపిన బస్సు డ్రైవర్‌ మేలేని యాదగి రిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement