ఉన్నత శిఖరాలను అధిరోహించాలి | Sakshi
Sakshi News home page

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

Published Wed, Nov 15 2023 1:02 AM

-

నాగర్‌కర్నూల్‌ క్రైం: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించడంతోపాటు తల్లిదండ్రులు, ఉపాద్యాయులకు మంచిపేరు తీసుకురావాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీ సబిత అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని నాగనులు కేజీబీవీలో మంగళవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్ల నిండిన తర్వాత వివాహం చేయాలని, చిన్న వయస్సులో పెళ్లి చేయడం వల్ల అనేక రకాల శారీరక, మానసిక సమస్యలు ఏర్పడుతాయన్నారు. బాలికలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలన్నారు. విద్యార్థినులు తమకు ఏమైనా సమస్యలు ఉంటే డయల్‌ 100 ఫోన్‌ చేయాలన్నారు. న్యాయ శాఖ ద్వారా మహిళలు, వృద్ధులు, షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు చెందినవారికి, రూ.3 లక్షలకు తక్కువ ఆదాయం ఉన్న వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. అనంతరం ఖోఖో పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు మధుసూదన్‌రావు, బాబు పియర్స్‌, సోమ ప్రశాంతరావు, భవానీబాయి, రామచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement