ఈ బస్తాలు ఆగేనా..? | Sakshi
Sakshi News home page

ఈ బస్తాలు ఆగేనా..?

Published Sun, Nov 19 2023 1:16 AM

ఇసుక బస్తాలను నింపుతున్న సిబ్బంది  - Sakshi

ఏటూరునాగారం: ఎన్నికలు, మేడారం జాతర సమీపిస్తోందన్న కారణంతో హడావుడిగా నిర్మిస్తున్న కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలోని జంపన్నవాగు కాజ్‌వే(పైపుల కల్వర్టు) ఎంతకాలం నిలుస్తుందనేదానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాత్కాలిక రోడ్డు నిర్మాణం కోసం ఆర్‌ అండ్‌ బీ శాఖ నుంచి రూ.20లక్షలు మంజూరు కాగా పనులను గుత్తేదారుతో చేయిస్తున్నారు. అయితే నీటిలో పైపులు దిగిపోకుండా వేస్తున్న ఇసుక బస్తాల నుంచి నీటి ఉధృతికి ఇసుక మొత్తం కొట్టుకుపోయి బస్తాలే మిగిలిపోతున్నాయి. పైపులు వేసిన తర్వాత కూడా ఇసుక మొత్తం కొట్టుకుపోతే పైపులు దిగబడి రోడ్డు కుంగిపోయే ప్రమాదం ఉంది. పైపులపై కేవలం ఇసుక పోయడం వల్ల కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఇసుక బస్తాల్లో వాగులోని ఇసుకను నింపుతున్న క్రమంలో బస్తాలకు సరైన సీల్‌, తాళ్లతో కట్టడం వంటిది చేయకపోవడం గమనార్హం. దీనివల్ల ఇసుక రోజు రోజుకూ కొద్దిగా పోవడంతో మళ్లీ ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. పనులను పర్యవేక్షించాల్సిన ఆర్‌అండ్‌బీ అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్‌ ఇష్టానుసారంగా చేయడం పరిపాటిగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారులు పైపు కల్వర్టును నాణ్యతగా నిర్మించి తమ ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

కొండాయి కాజ్‌వేలో అయోమయం

పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు

కొండాయి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక రోడ్డు
1/1

కొండాయి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక రోడ్డు

Advertisement
Advertisement