మెరుగైన విద్యనందించాలి | Sakshi
Sakshi News home page

మెరుగైన విద్యనందించాలి

Published Thu, Nov 16 2023 1:32 AM

సమావేశంలో మాట్లాడుతున్న డీఈఓ పాణిని - Sakshi

ములుగు: విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని డీఈఓ పాణిని సూచించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన కాంప్లెక్స్‌ సమాశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాలల్లో బ్రేక్‌ ఫాస్ట్‌ పథకాన్ని మొదలు పెట్టామన్నారు. బ్రేక్‌ ఫాస్ట్‌ ద్వారా విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలు, సదుపాయాలను తెలియజేస్తూ హాజరుశాతం పెరిగేలా చూడాలన్నారు. విధిగా హాజరుకాని విద్యార్థులను గుర్తించి తల్లిందండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా విద్యాబోధన, రివిజనింగ్‌ చేపట్టాలన్నారు. డిసెంబర్‌లోగా సిలబస్‌ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ ఉపాధ్యాయుడు కాంప్లెక్స్‌ సమావేశానికి హాజరై వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు రాఘవులు, సంజీవ, ఎంఈఓ శ్రీనివాసులు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం ఎన్నెం విజ యమ్మ, రిసోర్స్‌ పర్సన్స్‌ సతీష్‌, షర్మిల, నాగిరెడ్డి, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

డీఈఓ పాణిని

Advertisement
Advertisement