పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దాలి | Sakshi
Sakshi News home page

పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దాలి

Published Fri, Sep 1 2023 2:18 AM

-

కాటారం: కాటారం మండలం ప్రతాపగిరి, గొంతెమ్మ గుట్టలను పర్యాటకకేంద్రాలుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఎంపీటీసీలు మహేష్‌ రవీందర్‌రావు, జాడి మహేశ్వరి, కోఆప్షన్‌ సభ్యుడు అజీజ్‌ కలెక్టర్‌ భవేష్‌మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం కలెక్టర్‌ను కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు కలిసి ప్రతాపగిరిగుట్ట, గొంతెమ్మ గుట్టల విశిష్టతను వివరించారు. గుట్టపై దేవతామూర్తుల ఆనవాళ్లు ఉన్నాయని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు ఎంపీపీ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement