KGF Yash Interesting Comments On Jr NTR Mother Shalini, Full Deets Here - Sakshi
Sakshi News home page

Yash-NTR Mother Shalini: తారక్‌ మదర్‌ నన్ను చాలా ప్రత్యేకంగా చూసుకున్నారు

Apr 14 2022 11:16 AM | Updated on Apr 14 2022 5:02 PM

Yash Interesting Comments On Jr NTR Mother Shalini in Latest Interview - Sakshi

Yash Interesting Comments On Jr NTR Mother Shalini: కన్నడ స్టార్‌ హీరో యశ్‌ తాజాగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం కేజీఎఫ్‌ 2 గురువారం(ఏప్రిల్‌ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు విడుదలైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళుతోంది.  ఈ మూవీ విడుదల నేపథ్యంలో చిత్రం గత కొద్ది రోజులుగా ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్‌గా కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, హీరో యశ్‌ యాంకర్‌ సుమతో ముచ్చటించారు.

చదవండి: కాబోయే భార్యకు రణ్‌బీర్‌ కాస్ట్‌లీ గిఫ్ట్‌! అదేంటో తెలుసా?

ఈ సందర్భంగా సుమ వారిని ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ గురించి చెప్పమని అడగ్గా.. సినిమా చాలా అద్భుతంగా ఉందంటూ రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లపై ప్రశంసలు కురిపించాడు ప్రశాంత్‌ నీల్‌. ఇక యశ్‌ మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఒక సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్ అని, పెద్ద స్క్రీన్‌పై సినిమా చూసి థ్రిల్ అయ్యానన్నాడు. అలాగే చరణ్‌, ఎన్టీఆర్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరూ గొప్ప నటులని, చరణ్, తారక్‌లతో తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని చెప్పాడు. ‘హైదరాబాద్‌లో నేను ఎక్కడ షూటింగ్‌ చేసినా చరణ్‌ ఇంటి నుంచి భోజనం పంపిస్తాడు. అంతేకాదు మా మధ్య అంతకుమించి స్పెషల్‌ బాండింగ్‌ ఉంది’ అని యశ్‌ అన్నాడు.

చదవండి: సోనూ సూద్‌కు ఫన్నీ రిక్వెస్ట్‌, స్పందించిన రియల్‌ హీరో

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తారక్ కూడా నన్ను వ్యక్తిగతంగా డిన్నర్‌కు ఆహ్వానించాడు. ఆయన కుటుంబం చాలా బాగా రీసివ్‌ చేసుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ తల్లి శాలిని గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆమెతో మంచి బాండింగ్‌ కుదిరింది. ఆమె కర్ణాటకకు చెందిన వారు కావడంతో మా మధ్య ప్రాంతీయ అనుబంధం ఏర్పడింది. అందుకే శాలినిగారు నన్ను చాలా ప్రత్యేకంగా చూసుకున్నారు.కుటంబంలోని వ్యక్తిగా ట్రీట్‌ చేశారు. ఆయన కుటుంబం ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికి మర్చిపోలేను’ అంటూ యశ్‌ చెప్పుకొచ్చాడు. కాగా హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌ స్టార్స్‌ సంజయ్‌ దత్‌, రవీణా టాండన్‌లు కీ రోల్‌ పోషించారు.

Advertisement
 
Advertisement
Advertisement