ఏడు జన్మల తోడుగా... | Vikram Veera Dheera Sooran Part 2 Kalallo lyrical video song release | Sakshi
Sakshi News home page

ఏడు జన్మల తోడుగా...

Mar 14 2025 2:49 AM | Updated on Mar 14 2025 2:49 AM

Vikram Veera Dheera Sooran Part 2 Kalallo lyrical video song release

‘‘కలల్లో కానరాకున్నా... నీ కోసం నేను వేచున్నా... నిన్నే నా ఏడు జన్మల తోడుగా కోరుకుంటున్నా’’ అంటూ మొదలవుతుంది ‘వీర ధీర శూరన్‌ పార్టు 2’ సినిమాలోని లవ్‌ సాంగ్‌. విక్రమ్‌ హీరోగా ఎస్‌.యు అరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని రియా శిబుల నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమాలోని ‘కలల్లో..’ అనే పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. రాజేశ్‌ గోపిశెట్టి సాహిత్యం అందించిన ఈ పాటను శరత్‌ సంతోష్, రేష్మ శ్యామ్‌ పాడారు. దుషారా విజయన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, సూరజ్‌ వెంజరాముడు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌.  

Advertisement
 
Advertisement
Advertisement