Vijay: లియో తర్వాత ఆ డైరెక్టర్‌తో పని చేయనున్న దళపతి

Vijay Next Movie With Gopichand Malineni or Venkat Prabhu? - Sakshi

ఒక క్రేజీ కాంబినేషన్‌లో భారీ చిత్ర రూపకల్పనకు అడుగులు పడుతున్నాయా? అంటే కోలీవుడ్‌లో అవుననే వినిపిస్తోంది. హీరో విజయ్‌ ప్రస్తుతం లియో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ తారాగణంతో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీంతో విజయ్‌ తర్వాత చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది.

విజయ్‌ కోసం పలు నిర్మాణ సంస్థలు, దర్శకులు ఎదురుచూస్తున్నారన్నది వాస్తవం. విజయ్‌ ఇటీవల వారీసు (తెలుగులో వారసుడు) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఏదేమైనా విజయ్‌తో తదుపరి చిత్రాన్ని చేయడానికి దర్శకుడు అట్లీతో పాటు, టాలీవుడ్‌ దర్శకుడు గోపిచంద్‌ మలినేని వేచి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ లిస్టులోకి ఇప్పుడు దర్శకుడు వెంకట్‌ ప్రభు కూడా చేరారు.

ఈయన తాజాగా నాగచైతన్య హీరోగా కస్టడీ అనే ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్‌ ఫిల్మ్‌ సంస్థ నిర్మించనున్న 100వ చిత్రంలో నటించడానికి విజయ్‌ పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి టాలీవుడ్‌ దర్శకుడు గోపిచంద్‌ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిది తాజాగా దర్శకుడు వెంకట్‌ ప్రభు పేరు తెరపైకి వచ్చింది. మరి ఫైనల్‌గా ఎవరి డైరెక్షన్‌లో ఉంటుందో తెలియాల్సి ఉంది.

చదవండి: మరోసారి సర్జరీ, 10 గంటలు నరకయాతన: జబర్దస్త్‌ రోహిణి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top