తెలుగులో ఆ రెండు సినిమాలే నా ఫేవరేట్: విజయ్ దేవరకొండ | Vijay Devarakonda Comments On His Favourate Films In Tollywood | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: ఆ సినిమా బాగలేదంటే గొడవ పెట్టుకుంటా: విజయ్ దేవరకొండ

Oct 28 2024 4:45 PM | Updated on Oct 28 2024 4:48 PM

Vijay Devarakonda Comments On His Favourate Films In Tollywood

టాలీవుడ్ హీరో విజయ్ దేవర ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్‌తో అభిమానులను అలరించాడు. పరశురామ్ పెట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం విజయ్ వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో నటించారు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే కేరళలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లిచూపులు హిట్ తర్వాత నా ఫస్ట్ చెక్‌ వచ్చింది సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచే.. త్రివిక్రమ్ సార్‌ నన్ను ఆఫీస్‌కు పిలిచి అందించారు. ఆయనను కలవడం నా జీవితంలో బిగ్‌ మూమెంట్‌ అన్నారు. నా ఫేవరేట్ సినిమాలు మహేశ్ బాబు నటించిన అతడు, ఖలేజా అని విజయ్ తెలిపారు. ఎవరైనా ఖలేజా సినిమా బాగలేదంటే వారితో గొడవపడేవాడిని అని విజయ్ దేవరకొండ అన్నారు.

కాగా..వీడీ 12 తర్వాత మరో రెండు చిత్రాల్లో విజయ్ నటించనున్నారు. రాహుల్‌ సంకృత్యాన్, రవి కిరణ్‌ కోలాల దర్శకత్వాల్లోనూ సినిమాలు చేసేందుకు విజయ్‌ దేవరకొండ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే వాటిపై ఫోకస్ పెట్టనున్నారు. వీడీ12 వచ్చే ఏడాది మార్చి 25న చిత్రం రిలీజ్‌ కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement