విజయ్‌ ఆంటోని 'తుఫాన్‌' ట్రైలర్‌ విడుదల | Vijay Antony Toofan Trailer Out Now | Sakshi
Sakshi News home page

విజయ్‌ ఆంటోని 'తుఫాన్‌' ట్రైలర్‌ విడుదల

Jun 30 2024 2:27 PM | Updated on Jun 30 2024 2:59 PM

Vijay Antony Toofan Trailer Out Now

విజయ్‌ ఆంటోని.. తెలుగు చిత్రపరిశ్రమలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్‌లో బాగా దగ్గరపయ్యాడు. రీసెంట్‌గా ఇటీవలే 'లవ్‌గురు'తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇప్పుడాయన 'తుఫాన్‌'తో మెప్పించనున్నాడు. విజయ్‌ మిల్టన్‌ తెరకెక్కించిన ఈ సినిమాని కమల్‌ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్‌ బోరా నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

సత్యరాజ్, శరత్‌ కుమార్, మేఘా ఆకాష్, మురళీ శర్మ, డాలీ ధనుంజయ వంటి స్టార్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా విడుదలైన తుఫాన్‌ ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా సాగింది. ఇది ఒక దీవిలో జరిగే కథతో రూపొందించారు. ఒక అపరిచిత వ్యక్తి అపరిచిత సమాజంలోకి అడుగు పెట్టాక ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడన్నదే ఈ ట్రైలర్‌లో ఉంది. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు అనుబంధాలు, భావోద్వేగాలు ఇలా అన్ని అంశాలున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement