Varun Tej And Lavanya Tripathi Likely To Get Married In Italy In 2023 Year End, Deets Inside - Sakshi
Sakshi News home page

Varun Lavanya Tripathi Marriage: వరుణ్‌, లావణ్యల పెళ్లి ఎక్కడ..? ఎప్పుడు..?

Jun 10 2023 2:06 PM | Updated on Jun 10 2023 3:19 PM

Varun Tej and Lavanya Tripathi will get married in Italy - Sakshi

మెగా హీరో వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపిస్తే.. ఇదంతా పుకార్లే అని కొట్టిపడేశారు. కానీ నిన్న జరిగిన నిశ్చితార్థంతో అందరికి ఓ క్లారిటీ వచ్చింది. తాము ప్రేమలో ఉన్నామని ఎప్పుడూ చెప్పకుండా.. సడెన్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని అందరికి షాకిచ్చింది ఈ జంట. అయితే ఇప్పుడు వీరి పెళ్లి ఎప్పుడనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. 

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు ఎక్కువగా డెస్టినేషన్‌ మ్యారేజ్‌లే చేసుకుంటున్నారు. తాజాగా యంగ్‌ హీరో శర్వానంద్‌ కూడా ఈ తరహా వివాహాన్నే చేసుకున్నారు. జైపూర్‌లోని ఫ్యాలెస్‌లో రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా శర్వానంద్‌ పెళ్లి జరిగింది. వరుణ్, లావణ్యలు కూడా ఓ మంచి డెస్టినేషన్‌ స్పాట్‌లోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటలీలోని ఓ ప్రముఖ ఫ్యాలెస్‌లో వీరి వివాహం జరుగబోతుందని సమాచారం. ఓ చిన్న సెంటిమెంట్‌ కారణంగా ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయిందట. వరుణ్‌, లావణ్యల ప్రేమకు పునాది పడింది ఇటలీలోనే. మిస్టర్‌ సినిమా షూటింగ్‌ కోసం ఇటలీ వెళ్లిన వరుణ్‌, లావణ్యలు..అక్కడే స్నేహితులుగా మారారట. కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. ప్రేమ పుట్టిన చోటో పెళ్లి చేసుకుందామని ఇద్దరు నిర్ణయించుకున్నారని తెలిసింది. మెగా ఫ్యామిలీ కూడా ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట.  ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో వీరి పెళ్లి ఉంటుందని టాక్‌ నడుస్తోంది. 

(చదవండి: అప్పటినుంచే ప్రేమలో ఉన్నామన్న లావణ్య.. పోస్ట్‌ వైరల్‌)

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement