అతుల్య రవి కొత్త సినిమా.. యాడ్‌ ఫిలిం డైరెక్టర్‌తో.. | Vaibhav, Athulya Ravi New Movie Launched | Sakshi
Sakshi News home page

సీనియర్‌ దర్శకుడి వారసుడితో హీరోయిన్‌ అతుల్య రవి కొత్త సినిమా..

Oct 26 2023 3:26 PM | Updated on Oct 26 2023 3:26 PM

Vaibhav, Athulya Ravi New Movie Launched - Sakshi

వీరిలో విక్రమ్‌ రాజేశ్వర్‌ 80కి పైగా యాడ్‌ ఫిలింస్‌కు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈయన సీనియర్‌ దర్శకుడు కె. రాజేశ్వర్‌ వారసుడు కూడా. కాగా ఈ చిత్ర వివరాల

నటుడు వైభవ్‌, నటి అతుల్య రవి జంటగా నటిస్తున్న నూతన చిత్రం విజయదశమి సందర్భంగా బుధవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. డా.మనోజ్‌ బెనో నేతృత్వంలో బీటీజీ యూనివర్శల్‌ పతాకంపై బాజీ బాలచంద్రన్‌ నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా విక్రమ్‌ రాజేశ్వర్‌, అరుణ్‌కేశవ్‌ ద్వయం దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

వీరిలో విక్రమ్‌ రాజేశ్వర్‌ 80కి పైగా యాడ్‌ ఫిలింస్‌కు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈయన సీనియర్‌ దర్శకుడు కె. రాజేశ్వర్‌ వారసుడు కూడా. కాగా ఈ చిత్ర వివరాలను దర్శకులు తెలుపుతూ ఇంకా ఈ సినిమాకు ఎటువంటి పేరు నిర్ణయించలేదన్నారు. ఈ మూవీ పూర్తి వినోదాత్మకంగా, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందన్నారు.

ఇందులో నటుడు ఆనంద్‌రాజ్‌, నాన్‌ కడవుల్‌ రాజేంద్రన్‌, జాన్‌ విజయ్‌, రెడిన్‌ కింగ్‌స్టీ, సునిల్‌రెడ్డి, ఇళవరసు, పీఎల్‌.తేనప్పన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పారు. దీనికి డీ.ఇమాన్‌ సంగీతాన్ని, టిజోటోనీ, సురేశ్‌ ఏ.ప్రసాద్‌ ఛాయాగ్రహణను అందిస్తున్నారని చెప్పారు. కాగా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు.

చదవండి: భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన.. 39 ఏళ్ల తర్వాత వెబ్‌ సిరీస్‌గా.. ఏ ఓటీటీలో అంటే?

Advertisement
 
Advertisement
Advertisement