'పుష్ప-2 చూశా'.. టాలీవుడ్ నిర్మాత కామెంట్స్ వైరల్! | Tollywood Producer SKN Comments On Pushpa 2 The Rule | Sakshi
Sakshi News home page

SKN: 'పుష్ప-2 చూశా.. అన్ని అవార్డులు ఖాయం': టాలీవుడ్ నిర్మాత!

Oct 14 2024 3:12 PM | Updated on Oct 14 2024 3:23 PM

Tollywood Producer SKN Comments On Pushpa 2 The Rule

టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న డిసెంబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. తాజాగా పుష్ప-2 మూవీపై టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 
 

నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ.. 'ఓ వారం క్రితం పుష్ప-2 రెండు సీన్స్ చూశా. అల్లు అర్జున్‌ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఏడేళ్లలో ఇండియాలో ఉన్న అన్ని అవార్డులను కొట్టేస్తాడన్న ఫీలింగ్ వచ్చింది. ఒక యాక్టర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అలా ఉంటది. ఒక డైరెక్టర్‌ క్రియేటివిటీ పీక్స్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటది. అందరికీ కూడా టాప్‌ ఫామ్‌లో ఉన్నప్పుడు.. అలాంటి ప్రొడక్ట్ మాత్రమే వస్తది. అది చూసినప్పుడు నాకు అలా అనిపించింది. డిసెంబర్‌లో రిలీజయ్యే పుష్ప-2 తెలుగు సినిమాను ఇంకోస్థాయికి తీసుకెళ్తుందని బలంగా నమ్ముతున్నా' అని అన్నారు.

అంతేకాకుండా ప్రభాస్  ది రాజాసాబ్‌ గురించి ఆయన మాట్లాడారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 23 నుంచి సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ప్రారంభమవుతాయని నిర్మాత శ్రీనివాస కుమార్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా  జరుగుతున్నట్లు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement