అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్‌- జైనాబ్‌ పెళ్లి తేదీ ఫిక్స్! | Tollywood Hero Akhil Akkineni Marriage Date Goes Viral | Sakshi
Sakshi News home page

Akhil Akkineni: అఖిల్‌ అక్కినేని- జైనాబ్‌ పెళ్లి తేదీ ఫిక్స్!

May 29 2025 9:23 PM | Updated on May 29 2025 9:32 PM

Tollywood Hero Akhil Akkineni Marriage Date Goes Viral

అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి సందడి మొదలు కానుంది. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని అఖిల్‌ ఓ ఇంటివాడు కాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన త్వరలోనే ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేయనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌ వినిపిస్తోన్న టాక్ ప్రకారం వచ్చేనెలలోనే అక్కినేని ఇంట పెళ్లిభాజాలు మోగనున్నాయి. అఖిల్‌ తన ప్రియురాలు జైనాబ్‌ రవ్దీని జూన్‌ 6న పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగానే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. గతేడాది అక్కినేని నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను ఆయన పెళ్లాడారు. వీరి పెళ్లి ప్రకటన తర్వాతే అఖిల్ అక్కినేని ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. జైనాబ్ రవ్దీతో నిశ్చితార్థం జరిగినట్లు అక్కినేని నాగార్జున వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement