Tollywood Comedian Allu Ramesh Passes Away Today Due To Heart Attack - Sakshi
Sakshi News home page

Allu Ramesh Death: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అల్లు రమేశ్ మృతి!

Apr 18 2023 11:16 AM | Updated on Apr 18 2023 12:14 PM

Tollywood Comedian Allu Ramesh Passes Away Today - Sakshi

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, కమెడియన్ అల్లు రమేశ్ కన్నుమూశారు. మంగళవారం విశాఖపట్నంలో గుండెపోటుతో ఆయన మరణించారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ఆనంద్‌ రవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అల్లు రమేశ్ సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ల్లో కూడా కనిపించారు. ఇటీవలే విడుదలైన నెపోలియన్ సినిమాలో ఆయన నటించారు. 

విశాఖపట్టణానికి చెందిన అల్లు రమేష్ నాటకాల్లో నటించేవారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.  యూట్యూబ్‌లో ప్రసారమయ్యే ‘మా విడాకులు’ వెబ్ సిరీస్‌లో నటించారు.  తోలుబొమ్మలాట, మధుర వైన్స్, రావణ దేశం వంటి కొన్ని సినిమాలలో నటించారు. తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా తనదైన ప్రత్యేక కోస్తా యాసతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement