వారం రోజులుగా షూట్‌లో ఉన్నా.. ఆ పార్టీ గురించే తెల్వదు: రచ్చ రవి | Tollywood actor Racha Ravi Clarity On Attending In Mangli Birthday party | Sakshi
Sakshi News home page

Racha Ravi: వారం రోజులుగా షూట్‌లో ఉన్నా.. దయచేసి అర్థం చేసుకోండి: రచ్చ రవి క్లారిటీ

Jun 11 2025 9:07 PM | Updated on Jun 11 2025 9:25 PM

Tollywood actor Racha Ravi Clarity On Attending In Mangli Birthday party

టాలీవుడ్ నటుడు, కమెడియన్ రచ్చ రవి అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మంగ్లీ బర్త్ ‍డే పార్టీకి తాను వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో నువ్వు వైరలవుతున్నావని చాలామంది నాకు ఫోన్ చేశారని అన్నారు. నేను ప్రస్తుతం నా షూట్లతో బిజీగా ఉన్నానని తెలిపారు.

బర్త్‌ డే పార్టీలో రచ్చరవి అని ఉన్నారని మీరంతా అనుకుంటున్నారు.. కానీ ఇండస్ట్రీలో నేనొక్కడినే రచ్చరవి అని.. అక్కడున్న వ్యక్తి తాను కాదని స్పష్టం చేశారు. ఆ పార్టీ గురించి కూడా నాకు తెల్వదు.. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఈ విషయం చెప్పాలనుకున్నా.. అందుకోసమే దయచేసి అర్థం చేసుకోండి.. అపార్థం చేసుకోవద్దని రచ్చరవి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. నేను తాగను... తాగబోను... నాకు తెలవదు దయచేసి అర్ధం చేసుకోండి.. అంటూ రాసుకొచ్చారు. కాగా.. ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ నటులు ఉన్నారని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే రచ్చరవి క్లారిటీ ఇచ్చారు.

కాగా.. ఇవాళ ఉదయం టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది.  ప్రముఖ సింగర్‌ మంగ్లీ(Singer Mangli) బర్త్‌డే పార్టీలో గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్‌ డే సందర్భంగా మంగ్లీ నిన్న(జూన్‌ 10)హైదరాబాద్‌ సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రిసార్ట్‌పై దాడి చేసి విదేశీ మద్యం సీజ్‌ చేశారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement