రోహిణికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బిగ్‌బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న టేస్టీ తేజ! | Telugu Bigg Boss Latest Promo Out Now | Sakshi
Sakshi News home page

Bigg Boss: రోహిణికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బిగ్‌బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న టేస్టీ తేజ!

Nov 12 2024 6:27 PM | Updated on Nov 12 2024 6:36 PM

Telugu Bigg Boss Latest Promo Out Now

తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్‌ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. మరో నెల రోజుల్లోపే బిగ్‌ గేమ్ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. గత రెండు నెలలుగా బుల్లితెర ప్రియులను ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ సీజన్ 11వ వారానికి చేరుకుంది. గతవారంలో వెల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌ హరితేజ ఎలిమినేట్ అయింది. ఇక మరోవారం మొదలైందంటే చాలు నామినేషన్ల గొడవే. ఆ రోజంతా ఒకరిపై ఒకరు చిన్నపాటి యుద్ధం చేయాల్సి ఉంటుంది. అలా ఈ వారంలో గౌతమ్‌, తేజ, పృథ్వీ, అవినాష్‌, విష్ణుప్రియ, యష్మీ నామినేషన్స్‌లో నిలిచారు.

ఇవాల్టి ఎపిసోడ్‌లో హౌస్‌ను కాస్తా ఎమోషనల్‌గా మార్చేశాడు బిగ్‌బాస్‌. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రారంభంలోనే టేస్టీ తేజ ఫుల్ ఎమోషనల్‌గా కనిపించాడు. నేను ఏడిస్తే మా అమ్మకు నచ్చదు అంటూ ఆమెను తలచుకుని ఏడుస్తూ.. కన్నీళ్లు తుడుచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.

ఆ తర్వాత కంటస్టెంట్స్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించారు.  రోహిణికి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్. ఆమె కుమారుడితో పాటు రోహిణి వాళ్ల అమ్మను హౌస్‌లోకి పంపించారు. అక్కడికెళ్లిన రోహిణి కుమారుడితో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ అందరూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన తాజా ప్రోమోను రిలీజ్‌ చేశారు.    

Advertisement
 
Advertisement
Advertisement