తారక్‌పై కోపం కల్యాణ్‌ రామ్‌ మీద తీర్చుకున్న చంద్రబాబు, బాలయ్య బ్యాచ్‌ | Sakshi
Sakshi News home page

తారక్‌పై కోపం కల్యాణ్‌ రామ్‌ మీద తీర్చుకున్న చంద్రబాబు, బాలకృష్ణ బ్యాచ్‌

Published Sat, Dec 30 2023 9:05 PM

TDP Negative Talk Spread On Kalyan Ram Devil Movie - Sakshi

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా భారీ అంచనాల మధ్య శుక్రవారం (డిసెంబర్ 29) విడుదలైంది. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్‍ లైన్‌తో వచ్చిన ఈ సినిమాకు మంచి ప్రచారమే దక్కింది. సినిమా విడుదలకు ముందు కల్యాణ్‌ రామ్‌ చేసిన వ్యాఖ్యలతో డెవిల్‌ నష్టపోయాడని తెలుస్తోంది. మరోవైపు జూ ఎన్టీఆర్‌ మీద ఉన్న కోపాన్ని టీడీపీ సోషల్‌ మీడియా విభాగం  కల్యాణ్‌ రామ్‌ మీద చూపించిందా..? అంటే నిజమే అని నేటి డెవిల్‌ కలెక్షన్స్‌ చెబుతున్నాయి.

డెవిల్‌ విడుదలకు ముందు కల్యాణ్‌ రామ్‌ ఏం అన్నారు
2024 ఎన్నికల్లో ఎటువైపు ఉంటారని ఒక ఇంటర్వ్యూలో కల్యాణ్‌ రామ్‌కు ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా ఆయన ఇలా చెప్పారు. 'ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు.. ఫ్యామిలీ అంతా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. అందువల్ల ఫ్యామిలీ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చెబుతాను.' అన్నాడు. వెంటనే  కల్యాణ్‌ రామ్‌కు మరో ప్రశ్న ఎదురైంది. ఫ్యామిలీ అంటే ఎవరు..? మీరు, ఎన్టీఆర్‌నే కదా.. ఇంకెవరు లేరు కదా.. అని మళ్లీ అడిగితే, అవును, మేమిద్దరమే మిగిలాం.. ఇద్దరమే కలిసి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. కానీ తన తాత గారి సొంతమైన టీడీపీ పార్టీ ఉంది కదా.. అటువైపే ఉంటామని ఆయన చెప్పలేదు. దీంతో టీడీపీలో గుబులు ఏర్పడింది.

తారక్‌ మీద టీడీపీ బ్యాచ్‌లో కోపం.. ఎఫెక్ట్‌ చూపిన డెవిల్‌ కలెక్షన్స్‌
చంద్రబాబు, బాలకృష్ణ ఇద్దరూ ఒకవైపు ఉంటే జూ ఎన్టీఆర్‌ మరోవైపు ఉన్నాడు. వారి మధ్య అనేక విభేదాలతో కూడిన కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నారా లోకేష్‌కు తారక్‌ ఎక్కడ పోటీ తగులుతాడో అని కావాలనే టీడీపీకి జూ ఎన్టీఆర్‌ను దూరం చేశాడు చంద్రబాబు. ఈ విషయం జగమెరిగిన సత్యం. టీడీపీ కోసం గతంలో ప్రాణాలకు తెగించి ఎన్టీఆర్‌ పనిచేశాడు. అతనిలోని టాలెంట్‌ను గమనించి చంద్రబాబు జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ ప్రచారం చేసిన అన్నీ ప్రాంతాల్లో టీడీపీ ఓడిపోయిందని పచ్చ మీడియాలో ప్రచారం చేపించాడు. దీంతో తారక్‌ పార్టీకి దూరం అయ్యాడు.

కాలక్రమేనా అలాంటి పాపాలే చంద్రబాబును వెంటాడాయి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు కానీ తారక్‌ రియాక్ట్‌ కాలేదని, టీడీపీ బ్యాచ్‌ ఓపెన్‌గానే గగ్గోలు పెట్టింది. అలా తారక్‌తో వైరంతో పాటు దూరం పెరిగింది.  చాలా ఏళ్ల నుంచి చంద్రబాబు, బాలయ్యకు తారక్‌ దూరంగానే ఉన్నాడు. దీంతో తారక్‌పై టీడీపీ నేతలు కోపం పెంచుకున్నారు. ఇదే తన అన్నగారు అయిన కల్యాణ్‌ రామ్‌ చిత్రంపై ఎక్కువగా ప్రభావం పడింది. టీడీపీకి చెందిన పలు సోషల్‌ మీడియా ఖాతాల నుంచి బహిరంగంగానే పోస్టులు పెడుతున్నారు.  

చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ అభిమానులు ఎవరూ డెవిల్‌ సినిమా వైపు వెళ్లకండి అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. డెవిల్‌ సినిమాను బహిష్కరిస్తున్నట్లు వారు ఓపెన్‌గానే ప్రచారం చేశారు. సినిమా బాగున్నా కూడా ఇంత తక్కువ మొత్తంలో కలెక్షన్స్‌ రావడం ఏంటి..? అంటూ ట్రేడ్‌ అనలిస్ట్‌లే ఆశ్చర్య పోతున్నారు. తారక్‌, కల్యాణ్‌ రామ్‌ ఇద్దరూ  టీడీపీ వైపు రాకుంటే వారి సినిమాలకు టికెట్లు కూడా చిరగవు అని భయపెడుతూ పచ్చ మిడీయాలో డిబెట్‌లు కూడ జరిగిన విషయం తెలిసిందే. కానీ అక్కడ ఉండేది టైగర్‌ అని టీడీపీ మంద మరిచిపోయినట్లు ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement