సుస్మితా సేన్ 'తాలి'.. ఆసక్తిగా ట్రైలర్ | Sushmita Sen as Shreegauri Sawant Role Of Taali Web series Trailer | Sakshi
Sakshi News home page

Taali Trailer: ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో సుస్మితా సేన్.. ట్రైలర్ వచ్చేసింది!

Aug 7 2023 9:07 PM | Updated on Aug 7 2023 9:08 PM

Sushmita Sen as Shreegauri Sawant Role Of Taali Web series Trailer - Sakshi

బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితాసేన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ 'తాలి'. ఈ చిత్రంలో సుస్మితాసేన్‌ ట్రాన్స్‌జెండర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఈనెల 15 నుంచి జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం భాషల్లోనూ రానుంది. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 

 తాజాగా విడుదలైన ట్రైలర్‌ అభిమానులలో మరింత ఆసక్తి పెంచింది. ఈ సిరీస్‌లో సుస్మిత.. ట్రాన్స్‌జెండర్ శ్రీగౌరీ సావంత్ పాత్రలో కనిపించనుంది. దేశంలోని ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం ఆమె ఎలా పోరాడిందో ఈ సిరీస్‌లో ప్రధానంగా చూపించనున్నారు. ట్రాన్స్‌జెండర్ పాత్రలో సుస్మితాసేన్ హావభావాలు ప్రేక్షకులను కట్టి పడేసేలా ఉన్నాయి. 

 ఈ సందర్భంగా సుస్మితా సేన్‌ మాట్లాడుతూ..' ఈ కథ వినిగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నా. కానీ ట్రాన్స్‌జెండర్‌ పాత్ర కోసం రెడీ కావడానికి దాదాపు  ఆరున్నర నెలల సమయం పట్టింది. ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నప్పుడు పరిశోధన కూడా అవసరం. ట్రాన్స్‌జెండర్‌ హక్కుల కోసం పోరాటం చేసిన శ్రీగౌరి సావంత్‌  గొప్ప వ్యక్తి.  ఆమె నాకు ఎంతో కనెక్ట్‌ అయ్యారు. ఆమెతో కలిసి కొన్ని రోజులు ఉండటం నాకు దక్కిన అదృష్టం.'అని అన్నారు. అయితే తన కథను సిరీస్‌గా తీయడం పట్ల శ్రీగౌరి కూడా సంతోషం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement