రజినీకాంత్‌ వెట్టైయాన్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే? | Super Star Rajinikanth Vettaiyan trailer to release on This Date | Sakshi
Sakshi News home page

Vettaiyan Trailer: రజినీకాంత్‌ వెట్టైయాన్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

Sep 30 2024 7:11 PM | Updated on Sep 30 2024 7:51 PM

Super Star Rajinikanth Vettaiyan trailer to release on This Date

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం వెట్టైయాన్. ఈ సినిమాను టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ కూడా కనిపించనున్నారు. ఈ దసరాకు థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. వేట్టైయాన్ ట్రైలర్‌ను అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ సెన్సార్‌ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్‌టైమ్‌ దాదాపు 2 గంటల 43 నిమిషాల 25 సెకన్లు ఉన్నట్లు తెలుస్తోంది. వెట్టైయాన్‌కు సెన్సార్‌ బోర్డ్‌ యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. మూడు చోట్ల డైలాగ్స్‌పై సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని మ్యూట్‌ చేయాలని.. లేదంటే వేరే పదాలు వినియోగించాలని చిత్ర బృందానికి సూచించింది.

(ఇది చదవండి: రజినీకాంత్‌తో నటించావా? అని అడిగారు.. రాయన్‌ ఫేమ్‌ ఆసక్తికర కామెంట్స్!)

ఈ మూవీలో ఫహాద్‌ ఫాజిల్‌, రితికా సింగ్‌, మంజు వారియర్‌, దుషారా విజయన్‌ కీలక పాత్రలు పోషించారు. తెలుగులోనూ ఇదే పేరుతో వెట్టైయాన్ విడుదల కానుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement