తొలిసారి మాస్‌ సాంగ్‌ పాడిన 'సుహాస్‌' | Suhas First Time Song Performance For Oh Bhama Ayyo Rama Movie | Sakshi
Sakshi News home page

తొలిసారి మాస్‌ సాంగ్‌ పాడిన 'సుహాస్‌'

Jun 27 2025 5:07 PM | Updated on Jun 27 2025 5:07 PM

Suhas First Time Song Performance For Oh Bhama Ayyo Rama Movie

టాలీవుడ్‌ హీరో సుహాస్ తొలిసారి గాయకుడిగా మారాడు. తను నటిస్తున్న కొత్త సినిమా 'ఓ భామ అయ్యే రామ' కోసం అదిరిపోయే మాస్‌ సాంగ్‌ను ఆయన పాడారు. ఈ చిత్రంలో సుహాస్‌కు జోడిగా మాళవిక మనోజ్‌ నటించింది.  ఈ ప్రేమకథ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వీ ఆర్ట్స్‌ బ్యానర్‌లో హరీశ్ నల్లా నిర్మించారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్‌ దశలో ఉంది. 

జూలై 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రవీందర్ విజయ్, బబ్లూ పృథ్వీ రాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, సాథ్విక్ ఆనంద్, నయని పావనిముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాధన్ సంగీతమందిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement